Live Gold & Silver Rates

మొదటి రాత్రి (Modha Rathri) సినిమా పూర్తి కథా వివరణ

కథా ప్రారంభం - పెళ్లి ఏర్పాట్లు:

ఇది ఒక ఆసక్తికరమైన విలేజ్ ఫ్యామిలీ డ్రామా సినిమా. పెళ్లి ఇష్టం లేక ఐదేళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న హీరో ప్రవీణ్‌ను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక అబద్ధం చెప్పి (మేనల్లుడికి గుండు గీస్తున్నారని) ఇండియాకి రప్పిస్తారు. ఇక్కడ హీరోకి అదే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. మరోవైపు హీరోయిన్ ముత్తు మాత్రం తన లవర్ నితీష్‌తో కలిసి పారిపోవాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. ముత్తు వాళ్ళ బాబాయ్ పెళ్లి పనులు చూసుకుంటుంటాడు. పెళ్లి సమయంలో ఫస్ట్ నైట్ కోసం ఆర్డర్ ఇచ్చిన మంచం రాకపోవడం, వస్తున్న ఆటో దారిలో గేదల వల్ల ఆగిపోవడం లాంటి చిన్న కామిక్ సన్నివేశాలు జరుగుతాయి.

పెళ్లి మరియు లవర్ ప్లాన్:
ఎయిర్‌పోర్ట్‌లో తన బావ ద్వారా అసలు నిజం తెలుసుకున్న ప్రవీణ్ ముందు కోప్పడినా, వాళ్ళ బావ ఎమోషనల్ చేయడంతో పెళ్లికి ఒప్పుకుంటాడు. విచిత్రమైన గడ్డంతో మండపానికి వచ్చిన ప్రవీణ్‌కు వాళ్ళ చెల్లి గడ్డం గీయించి పీటల మీద కూర్చోబెడుతుంది. మరోవైపు బాత్‌రూమ్‌లో ఉన్న ముత్తు తన లవర్ నితీష్‌కి ఫోన్ చేసి రమ్మని అడుగుతుంది. కానీ ఆ లవర్ గాడు సరిగ్గా నిద్ర లేవక, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా నీవు అక్కడే ఉండు అని సోమరిపోతు సమాధానాలు చెబుతాడు. ఎలాగో టైమ్‌కి రాలేడని తెలిసి ముత్తు సైలెంట్ వచ్చి పెళ్లి పీటల మీద కూర్చుంటుంది. ప్రవీణ్ తాలి కట్టేస్తాడు. పెళ్లి అయ్యాక ఫోటోల సమయంలో ముత్తు తన లవర్ మోసాన్ని తలుచుకుంటూ కోపంతో ఫ్రస్ట్రేషన్‌లో ఊరమాస్ డాన్స్ వేసి అందరినీ షాక్ గురి చేస్తుంది.

ఫస్ట్ నైట్ & పారిపోవడానికి ప్రయత్నం:
పెళ్లి తర్వాత అందరూ ఇంటికి వస్తారు. దారిలో ఒక పాత బావి కనిపిస్తుంది, దాన్ని ప్రవీణ్ చాలా డీప్ గా చూస్తుంటాడు. రాత్రి ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళిన ప్రవీణ్, ముత్తు ఇద్దరూ బిడియంగా కూర్చుంటారు. కొద్దిసేపటికి బాత్‌రూమ్‌కి వెళ్తున్నానని చెప్పిన ముత్తు, వెంటిలేటర్ ద్వారా పారిపోవడానికి ట్రై చేస్తూ ప్రవీణ్‌కు దొరికిపోతుంది. తనకు ఆల్రెడీ లవర్ ఉన్నాడని, ఈ పెళ్లి ఇష్టం లేదని ఏడ్చి చెప్తుంది. ఆ మాట విన్న ప్రవీణ్ చాలా హర్ట్ అవుతాడు. అయినా ముత్తు గుండె పగిలేలా ఏడుస్తుండటంతో కరిగిపోయి, రూమ్ లైట్స్ ఆఫ్ చేసి ఆమెను పారిపోవడానికి ఒప్పుకుంటాడు.

లవర్ అసలు రంగు & నిజం బయటపడటం:
మరోవైపు ముత్తు లవర్ నితీష్ బండిలో పెట్రోల్ అయిపోవడం, డబ్బులు లేకపోవడంతో నానా కష్టాలు పడతాడు. వాడి ఫ్రెండ్స్ కూడా "ఆ అమ్మాయిని దుబాయ్ వాడితోనే హ్యాపీగా ఉండనివ్వు, నీ దగ్గర ఏముంది?" అని తిట్టి పంపిస్తారు. ముత్తు ఎలాగోలా ఇంట్లో నుంచి బయటికి వచ్చి పొలిమేర దగ్గరకు వస్తుంది. ప్రవీణ్ కూడా ఆమెకు దారి చూపుతూ ఆ గుడి దగ్గరకు తీసుకెళ్తాడు. అక్కడ లవర్ నితీష్ వస్తాడు. ముత్తు వాడితో కలిసి వెళ్దామని అంటుంటే, నితీష్‌కి బాధ్యతలు మోసే ధైర్యం లేక, "నేను నీకంటే పదే చిన్నవాడిని, ఇదంతా నాకు సెట్ కాదు, మీ మొగుడి దగ్గరికే వెళ్ళు" అని దారుణంగా హ్యాండ్ ఇస్తాడు. ముత్తు వాడి చెంప పగలకొట్టి నిలదీస్తే, ప్రవీణ్ కూడా డబ్బు ఇస్తానని బ్రతిమిలాడినా వాడు బైక్ మీద ఎస్కేప్ అయిపోతాడు.

గతం మరియు పూజారి చెప్పిన నిజం:
వర్షంలో తడుస్తున్న ముత్తు వద్దకు ప్రవీణ్, గుడి పూజారి వెళ్తారు. ప్రవీణ్ ఆమెను అక్కడే వదిలేయకుండా రక్షిస్తాడు. ఆ సమయంలో పూజారి ప్రవీణ్ గతం గురించి చెబుతాడు. ప్రవీణ్ గతంలో ఒక అమ్మాయిని ప్రేమిస్తే, కులాలు వేరని పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ బాధతో ప్రవీణ్ కూడా అదే బావిలో దూకి సూసైడ్ చేసుకోబోతే ఊరి జనం కాపాడతారు. అప్పటి నుంచి ప్రవీణ్ కూడా ఒంటరిగానే బాధపడుతుంటాడు. ఈ నిజం తెలుసుకున్న ముత్తు ప్రవీణ్‌ను అర్థం చేసుకుంటుంది.

క్లైమాక్స్ & ముగింపు:
ఇంట్లో ముత్తు పారిపోయిందని తెలిసి రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ముత్తు వాళ్ళ అమ్మ ముత్తును కొట్టబోతుంటే పూజారి సర్దిచెబుతాడు. అప్పుడే ప్రవీణ్ వాళ్ళ నాన్న నితీష్‌ను కాలర్ పట్టుకొని లాక్కొస్తాడు. అందరి ముందు నితీష్ అసలు ఎవరో, ముత్తు ఎవరిని ప్రేమించిందో బయటపడుతుంది. ముత్తు అందరి ముందు నుంచి నితీష్‌ని చూసి అసహ్యించుకుని బయటికి నడుస్తుంది. ప్రవీణ్ ఆమె వెనకాలే వెళ్తాడు. చివరికి గుడి దగ్గర ముత్తు తన కష్టాలను తలుచుకుని ఏడుస్తుంటే, ప్రవీణ్ "ఏం పర్వాలేదు, నేనున్నాను" అని భరోసా ఇస్తాడు. సరిగ్గా అదే సమయంలో పెళ్ళికి మంచం తెచ్చిన వాడు అడ్రస్ అడుగుతూ అక్కడికి వస్తాడు. అది చూసి ముత్తు, ప్రవీణ్ ఇద్దరూ మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. భవిష్యత్తులో ఇద్దరూ కలిసి బతుకుతారనే అందమైన భావనతో ఈ సినిమా సుఖాంతం అవుతుంది.

Post a Comment

0 Comments