పెళ్లి పిచ్చి - అవమానాలు:
కథ భవేష్ అనే వ్యక్తితో మొదలవుతుంది. ఇతనికి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కోరిక విపరీతంగా ఉంటుంది. కానీ భవేష్ టెన్త్ ఫెయిల్ అవ్వడం, సరైన ఉద్యోగం లేకపోవడం, చూడటానికి అమాయకుడిలా ఉండటంతో.. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లందరూ అతన్ని రిజెక్ట్ చేస్తుంటారు. ఊర్లో వాళ్ళు కూడా "నీకు అసలు పెళ్లి అవుతుందా?" అని ఎగతాళి చేస్తుంటారు. ఒకరోజు వచ్చిన పెళ్లి సంబంధం కూడా ఘోరంగా రిజెక్ట్ కావడంతో భవేష్ తీవ్ర మనస్తాపానికి గురవుతాడు. ఇదంతా తన తండ్రి వల్లే అని, సిటీకి వెళ్లి ఉద్యోగం తెచ్చుకుని పెళ్లి చేసుకున్నాకే మళ్ళీ ఊర్లో అడుగుపెడతానని ఛాలెంజ్ చేసి సిటీకి వచ్చేస్తాడు.
సిటీ లైఫ్ - భ్రమల ప్రపంచం:
సిటీకి వచ్చి తన ఫ్రెండ్ ముకేష్ దగ్గర ఆశ్రయం పొందుతాడు భవేష్. ముకేష్ ఫ్యాక్టరీలో పని కూడా ఇప్పిస్తాడు. కానీ ముకేష్ వేరే అమ్మాయిలను రూమ్‌కి తెచ్చుకుంటూ భవేష్‌ను బయట వెయిట్ చేయిస్తుంటాడు. ఇది నచ్చక భవేష్ వేరే రూమ్‌కి షిఫ్ట్ అవుతాడు. పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరుగుతాడు, ఒక ఏజెంట్‌కి డబ్బులిచ్చి మోసపోతాడు. విసుగు చెందిన భవేష్ ఆ ఏజెంట్‌ని నిలదీయగా.. రేపే నీకు పెళ్లి సెట్ చేస్తానని ఏజెంట్ చెబుతాడు. ఆ మరుసటి రోజు 'సోనాల్' అనే ఒక అందమైన అమ్మాయిని చూపిస్తాడు. భవేష్ ఆమె బ్యాక్‌గ్రౌండ్ కూడా అడగకుండా పెళ్లి చేసుకుంటాడు.
సోనాల్‌తో జీవితం - భవేష్ అపోహలు:
సోనాల్ భవేష్‌ను చాలా కేరింగ్‌గా చూసుకుంటుంది. ఇద్దరూ హనీమూన్‌కి కూడా వెళ్తారు. కానీ సోనాల్ తన గతం గురించి ఎప్పుడూ చెప్పదు. ఒకరోజు ముకేష్, సోనాల్‌ను ఇంప్రెస్ చేయడానికి వాళ్ళింటికి వస్తే సోనాల్ అతన్ని తరిమేస్తుంది. తన భార్య ఎంత మంచిదో అని భవేష్ సంతోషిస్తాడు. ఆ తర్వాత ఆమెను ఊరికి తీసుకెళ్లి తన తండ్రితో ఆస్తి కోసం గొడవపడతాడు భవేష్. అయితే సోనాల్ ఆస్తి కోసం భవేష్ మీద సీరియస్ అవ్వడంతో ఆమె మీద భవేష్‌కు అనుమానం మొదలవుతుంది. సిటీకి వచ్చాక తన ఆఫీస్ ఫ్రెండ్ రవి సలహాతో.. రవి వాళ్ళ ఆవిడను ఇంటికి తీసుకొస్తాడు భవేష్. వాళ్ళ ఆవిడ "సోనాల్ చాలా మంచిది" అని సర్టిఫికేట్ ఇస్తుంది.
ఊహించని ట్విస్ట్ - అసలు నిజం:
మరుసటి రోజు భవేష్ లేచి చూసేసరికి సోనాల్ ఇంట్లో కనిపించదు. కంగారుపడిన భవేష్ తన ఫ్రెండ్ రవికి కాల్ చేస్తాడు. రవి తన భార్య 'రీనా'తో కలిసి వస్తాడు. రీనాను చూడగానే భవేష్‌కు మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే నిన్న రాత్రి రవితో వచ్చిన ఆవిడ ఆమె కాదు. అప్పుడే రవి పోలీసులకు సమాచారం ఇస్తాడు.
పోలీసులు భవేష్ ఇల్లంతా వెతుకుతుంటే, వారికి ఊహించని విధంగా ఒక గుర్తుతెలియని అమ్మాయి డెడ్ బాడీ దొరుకుతుంది. ఆ అమ్మాయి ఎవరో, తన ఇంట్లోకి ఎలా వచ్చిందో భవేష్‌కు తెలియదు. పోలీసులు భవేష్‌ను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తారు. సోనాల్ ఫోటో చూపించమంటే వాడి దగ్గర ఒక్క ఫోటో కూడా ఉండదు. పెళ్లి చేసిన ఏజెంట్‌ను పట్టుకుని అడిగితే "నేను వీడికి అసలు పెళ్లే చేయలేదు, సోనాల్ అంటే ఎవరో కూడా నాకు తెలియదు" అని చెబుతాడు.
గుడిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన పోలీసులకు అసలు నిజం అర్థమవుతుంది. ఫుటేజ్‌లో భవేష్ గాలిలో ఎవరితోనో మాట్లాడుకుంటూ తనకి తానే పసుపుతాడు కట్టుకుంటాడు. అప్పటికి గాని పోలీసులకు అర్థం కాదు.. ఈ సోనాల్ అనే అమ్మాయే లేదు, అదంతా భవేష్ భ్రమ (Hallucination) అని. చిన్నప్పటినుంచి పెళ్లి మీద ఉన్న పిచ్చి ముదిరిపోయి, తన బ్రెయిన్‌లోనే సోనాల్‌ను క్రియేట్ చేసుకుంటాడు. హనీమూన్, ఆస్తి గొడవ, రవికి పరిచయం చేయడం.. అంతా భవేష్ ఒంటరిగా ఊహించుకున్నదే!
మిస్టరీ సాల్వ్ - అసలు నిందితుడు ముకేష్:
మరి ఇంట్లో ఉన్న ఆ డెడ్ బాడీ ఎవరిది? సైకియాట్రిస్ట్ సహాయంతో భవేష్ నుంచి పోలీసులు నిజాలు రాబడతారు. ఆ ఇంట్లో దొరికిన అమ్మాయి పేరు 'కాజల్'. ఆమె ముకేష్ గర్ల్ ఫ్రెండ్. భవేష్‌కు మెంటల్ కండిషన్ బాగోలేదని ముకేష్‌కు తెలుసు. అందుకే భవేష్ లేనప్పుడు ముకేష్ ఆ కాజల్‌ను భవేష్ రూమ్‌కి తెచ్చుకునేవాడు. ఆమె పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడంతో.. గొడవలో ముకేష్ ఆమెను దారుణంగా అంతం చేస్తాడు.
ఆ రాత్రి బాడీని మాయం చేయడానికి ముకేష్ వస్తే, అతన్ని దొంగ అనుకుని భవేష్ ఎదురుతిరుగుతాడు (ఆ సమయంలో సోనాల్ తనను కాపాడిందని భవేష్ ఊహించుకుంటాడు). అప్పుడే ముకేష్ కంగారులో పారిపోతూ రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. పోలీసులు నిజం తెలుసుకుని ముకేష్‌ను అరెస్ట్ చేస్తారు.
ముగింపు:
డాక్టర్ల ట్రీట్‌మెంట్‌తో భవేష్ మానసిక స్థితి కుదుటపడుతుంది. సినిమా చివరలో ఒక టీవీలో సినిమా ప్లే అవుతుంటుంది. అందులో భవేష్ ఇన్ని రోజులు ఊహించుకున్న సోనాల్ ఒక యాక్టర్‌గా కనిపిస్తుంది. చిన్నప్పటినుంచి ఆ సినిమాను చూస్తూ ఆమెనే తన భార్యగా భవేష్ ఊహించుకున్నాడని ఒక ఆసక్తికరమైన సైకలాజికల్ ముగింపుతో ఈ సిరీస్ ఎండ్ అవుతుంది.
0 Comments